Home  »  TV News  »  Illu illalu pillalu : ప్రేమ, ధీరజ్‌లను భయపెట్టిన ఫేక్ పోలీస్.. భాగ్యం ప్లాన్ మామూలుగా లేదుగా!

Updated : Jul 17, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -525 లో... మోపిదేవి నుంచి పోలీసులు ఫోన్ చెయ్యగనే ధీరజ్ ప్రేమ హడావిడి గా బయల్దేరతారు. ఆ విషయం నర్మదకి చెప్తారు. వేదవతికి నర్మద చెప్తుంది. ఏంటే ఇది ఇప్పుడే సంతోషంగా ఉంటున్నామనే టైమ్ కి ఇలా అయింది. ఇప్పుడు మోపిదేవి నుంచి ఫోన్ వచ్చిందంటే ఏమైనట్లు ధీరజ్, ప్రేమ పెళ్లి ఎలాంటి పరిస్థితిలో జరిగిందో బయటపడుతుందా ఏంటని వేదవతి అంటుంటే మీరేం కంగారు పడకండి అత్తయ్య అని నర్మద అంటుంది.

టెన్షన్ పడండి పడండి అని వల్లి నవ్వుకుంటుంది. ఎవరికో ఫోన్ చేసి ప్రేమ ధీరజ్ బయల్దేరారు.. వాళ్ళని ఇంకా పరిగెత్తించండి అని వల్లి అంటుంది. మరొకవైపు పెద్దావిడ బర్త్ డే ని గ్రాంఢ్  గా చెయ్యాలని సేనాపతి, భద్రవతి అనుకుంటారు.నాకు బర్త్ డే  వద్దు ఏం వద్దు నా చిన్నకూతురు వస్తే అప్పుడు అందరం హ్యాపీగా ఉంటాం.. తను రాని పుట్టినరోజు నాకు వద్దని పెద్దావిడ అనగానే అది ఆ పనోడితో లేచిపోయినప్పుడే చచ్చింది అనుకున్నాం కానీ నువ్వు దాన్ని రమ్మంటావ్ ఏంటని భద్రవతి కోప్పడుతుంది. మరొకవైపు ప్రేమ ధీరజ్ వాళ్ళు స్టే చేసిన హోటల్ కి వెళ్తారు. అక్కడ రిసెప్షనిస్ట్ తో మాట్లాడుతారు. వాళ్ళ వెనకాలే భాగ్యం, ఆనందరావు ఉంటారు. రిసెప్షనిస్ట్ వాళ్ళతో మిమ్మల్ని ఎప్పుడో చూసానని వాళ్ళ పెళ్లి ఎలాంటి సందర్బంలో జరిగిందో చెప్తుంది. అప్పుడే ఇన్‌స్పెక్టర్ ఫోన్ చేసి హోటల్ బయట ఉన్నా రమ్మని చెప్తాడు. దాంతో ప్రేమ, ధీరజ్ వెళ్తారు. మీరు రూమ్ లో స్టే చేసినప్పుడు ఒక హత్య జరిగిందని ఇన్‌స్పెక్టర్ అంటాడు.
 లేదని ధీరజ్ అంటాడు. మీరు ఏ రూమ్ నెంబర్ లో ఉన్నారని ఇన్‌స్పెక్టర్ అడుగుతాడు. ధీరజ్ చెప్పగానే అయ్యో సారీ అండి మేం పొరపాటు పడ్డామని ప్రేమ, ధీరజ్ ని ఇన్‌స్పెక్టర్ పంపిస్తాడు. ఆ తర్వాత ఇన్‌స్పెక్టర్ దగ్గరికి భాగ్యం వాళ్ళు వచ్చి నిజమైన పోలీసులాగా వచ్చారు.. ఇప్పుడు మీ పాత్ర అయిపొయిందని వాళ్ళకి డబ్బు ఇస్తుంది భాగ్యం. ఇప్పుడు ఆ హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్లి కావలసిన ఆధారాలు తీసుకుంటే నా కూతురు చక్రం తిప్పుతుందని భాగ్యం అంటుంది.

మరొకవైపు చందుకి వల్లి బాక్స్ తీసుకొని వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావని చందు కోప్పడి తను తీసుకొని వచ్చిన బాక్స్ ని అక్కడ పనివాళ్ళకి ఇస్తాడు. దాంతో వల్లి ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు ఎంత టెన్షన్ పడ్డానోనని ధీరజ్ తో ప్రేమ అంటుంది. మన ప్రయాణం ఇక్కడే మొదలైంది. ఒకసారి లోపలికి వెళ్లి చూద్దామా అని ప్రేమ ధీరజ్ వాళ్ళు పెళ్లి చేసుకున్న గదికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.